ఖిలా వరంగల్: కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరై కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీఓలు ఉమారాణి, సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, పర్యాటకశాఖ ఇన్‌చార్జ్ అనిల్, గజ్జల శ్యామ్, దామోదర్, కోట గైడ్ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం


