నగరంలో ఉల్లాస్‌ పరీక్షకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

నగరంలో ఉల్లాస్‌ పరీక్షకు విశేష స్పందన

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

● పరీక్ష రాసిన 3,700 మంది మహిళలు

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్‌ పరీక్షకు ట్రైసిటీలోని 3,700 మంది మహిళలు హాజరయ్యారు. నగరంలోని కొత్తవాడ, గిర్మాజీపేట, కరీమాబాద్‌ ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్యతో కలిసి వరంగల్‌ అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 47 కేంద్రాల్లో ఉల్లాస్‌ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.. పరీక్షలకు హాజరైన మహిళలతో మాట్లాడి, కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, హాజరు, పరీక్ష నిర్వహణ విధానం తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైవీ.గణేశ్‌ మాట్లాడుతూ.. ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉల్లాస్‌ ఇన్‌చార్జ్‌ అధికారి నాగేశ్వర్‌రావు, డీఎంసీలు రేణుక, రజిత టీఎంసీ రమేశ్‌ ఆర్పీలు, సీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement