వరంగల్ ఎల్లంబజార్లో 51 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వాహకుడు ఆకుతోట సంజయ్, భక్తులు 14 రోజులు విశేష పూజలు చేశారు. ఉత్సవాల నిర్వాహకులు క్షీరాభిషేకంతోపాటు రెండు ఫైరింజన్ల నీళ్లతో మట్టి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేశారు. అంతకు ముందు 51 కిలోల లడ్డూను రూ.2.25 లక్షలకు కాజీపేటకు చెందిన శంకర్, లావణ్య తులసి, నాగరాజు దేవిక కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. గణపతి నామస్మరణ మార్మోగింది. – వరంగల్ చౌరస్తా


