కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 28,30 తేదీల్లో నిర్వహించాల్సిన దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీ) పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ ఆదివారం తెలిపారు. ‘సెట్’ నేపథ్యంలో ఆయా పరీక్షలను వాయిదావేశామని చెప్పారు. మిగతా అన్ని పరీక్షలు టైంటేబుల్ ప్రకారం యథావిఽధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వాయిదాపడిన ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
సీఏఎస్ ఆర్‌ఎంఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కాశిబుగ్గ: వైద్య విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) హైదరాబాద్ నియంత్రణలో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో నాలుగు సీఏఎస్ ఆర్‌ఎంఓ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో మార్చి 31, 2027 వరకు లేదా అవసరం ముగిసేవరకు, లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఎంపికై న వైద్యులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 5న తాత్కాలిక జాబితా ప్రకటన, 6 నుంచి 7 వరకు అభ్యంతరాలు ప్రకటన, స్వీకరణ, అనంతరం ఎంపిక ప్రక్రియ వివరాలను వెబ్ సైట్‌లో ప్రకటిస్తామని ఆయన వివరించారు. పూర్తి వివరాలను www.kmcwgl.com. వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు.
సంప్రదాయాలను
విశ్వవ్యాప్తం చేయాలి
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ కల్చరల్: మన పండుగలు, కళలు, నృత్యాలు, సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, సంస్కృతీసంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు హనుమకొ ండలోని కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో శ్రీశాంతి కృష్ణ సేవా సమితి 41వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా ని ర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కాకతీయ కళా వైభవాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా కళారంగంతో పాటు వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన 108 మంది సన్మానించి సేవా సమితి పురస్కారాలు అందజేశారు.
అసెంబ్లీకి అణగారిన వర్గాల ప్రాతినిథ్యం : విశారదన్
కాజీపేట అర్బన్ : అణగారిన వర్గాల ప్రాతినిథ్యాన్ని అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ సూచించారు. హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ‘ఎవరి కులం ఎంతో వారికంత వాటా’ అనే అంశంపై ఏర్పాటు బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోని నాలుగు కోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, 40 లక్షలు ఉన్న అగ్రకులాల వారి మధ్య యుద్ధం జరగనుందని తెలిపారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని, రానున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ విజయం సాధించనుందని పేర్కొన్నారు. జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, కుమారస్వామి, చందా మల్లయ్య, రాఘవేంద్ర , సుమన్, కూరపాటి రమేశ్ పాల్గొన్నారు.


