హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, లైంగిక వ్యాధులు, టీబీ, రక్తదానంపై యువతకు విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ నుంచి నిట్ హనుమకొండ వరకు నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాను హెచ్‌ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ ప్రతి గర్భిణి మొదటి, రెండో, మూడో త్రైమాసికాల్లో తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.రవి, జిల్లా అదనపు వైద్యాధికారి టి.మదన్‌మోహన్‌రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాధవరెడ్డి, నెహ్రూనాయక్, హెచ్‌ఈఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, దేవీసింగ్, సువార్త, సబ్ యూనిట్ అధికారి విప్లవ్‌కుమార్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్‌వైజర్లు, సిబ్బంది, డీపీఎం మాధురి, కమలాకర్, రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కళాజాత బృందం పాల్గొన్నారు.


