విద్యా రుణాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా రుణాలపై అవగాహన కల్పించాలి

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

విద్యా రుణాలపై అవగాహన కల్పించాలి

న్యూశాయంపేట: విద్యా రుణాలపై అవగాహన పెంచి, విద్యార్థులకు రుణాలు అందించేలా సహకరించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా క్రెడిట్‌ప్లాన్‌ పురోగతిపై సమీక్షించారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గడ్డం జీవన్‌కుమార్‌ ప్రగతిని పీపీటీ ద్వారా వివరించారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్య తదితర ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని చైర్మన్‌ బండా ప్రకాశ్‌ సూచించారు. అనంతరం వార్షిక క్రెడిట్‌ పుస్తకాలను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ వసంత, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌

బండా ప్రకాశ్‌

క్రెడిట్‌ ప్లాన్‌ పురోగతిపై వరంగల్‌ కలెక్టరేట్‌లో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement