న్యూస్‌రీల్
గోల్డ్ మెడల్స్ ఇలా..
డ్రెస్ కోడ్ ఇలా..
నిట్ వరంగల్‌లో నేడు, రేపు పట్టాల ప్రదానం
కాజీపేట అర్బన్: కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల కల నెరవేరనుంది. విద్యార్థుల శ్రమ, అకుంఠిత దీక్షకు నేడు(శనివారం), రేపు (ఆదివారం) పట్టాభిషేకం జరగనుంది. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 24వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాంపస్‌లోని హోమీ బాబా సెమినార్‌హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టాల స్వీకరణ కీలక ఘట్టం అన్నారు. స్నాతకో త్సవం గురించి ఆయన తెలిసిన వివరాల ప్రకారం.. నిట్ 24వ కా న్వొకేషన్–26లో రెండు రోజుల పాటు 1,997 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. తొలి రోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి స్నాతకోత్సవం ప్రారంభం అవుతుంది. యూజీ విద్యార్థులు 930 మంది పట్టాలు స్వీకరిస్తారు. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 1,067 మంది పట్టాలు అందుకుంటారు.
ముఖ్య అతిథి టెక్సాస్ ఇండియా ఎండీ
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ హాజరై పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సంలో నిట్ చైర్‌పర్సన్ సేయాంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చైర్మన్, డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అధ్యత వహించనున్నారు. ప్రతీ విభాగంలో టాపర్లకు గోల్డ్‌మెడల్, ఓవరాల్ టాపర్‌కు ఇన్‌స్టిట్యూట్ గోల్డ్‌మెడల్‌తో పాటు ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలకు ‘ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోమెటిక్ కంట్రోల్ టెక్నాలజీస్ టు ఏవియేషన్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్’ అంశంపై పరిశోధనలకు డాక్టర్ పద్మనాభన్ కె.మీనన్‌కు, ‘డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ అంబీషన్స్ త్రూ విజనరీ టెక్నాలజీ లీడర్ షిప్’ అంశంపై పరిశోధనలకు ఆనంద్ రామమూర్తికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాలు అందజేయనున్నారు.
పట్టాల అందజేత ఇలా..
డైరెక్టర్స్ గోల్డ్ మెడల్–అకడమిక్ విభాగం
రోల్ ఆఫ్ హానర్ గోల్డ్‌మెడల్–
సిద్ది బర్పూటే–బీటెక్ మెకానికల్
గోల్డ్ మెడల్ ప్రతి విభాగంలో.. బీటెక్..)
ప్రియాంషుకుమార్‌సింగ్– సివిల్
నీలజాల జోషి – ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
వలుస రఘువరణ్– మెకానికల్
దొండపాటి లోకేశ్వర్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
మదగాని సాత్విక్ – మెటలర్జీ
సిద్ది బర్పూటే – కెమికల్
జయంతి అంషు – కంప్యూటర్ సైన్స్
అమన్ అబ్ధులాసమద్ ఇనామ్‌దార్
బయోటెక్నాలజీ
నిట్ వరంగల్ 24వ కాన్వొకేషన్ మహోత్సవంలో డిగ్రీ పట్టాలు స్వీకరించే విద్యార్థులు బాయ్స్ తెల్లటి కుర్తా పైజామా, గర్ల్స్ తెల్లటి కుర్తా పైజామా లేదా తెల్లటి చీర, విద్యార్థులు వారికి కేటాయించిన కండువాను మెడలో ధరించాలి. తెల్లటి వస్త్రాలతో పాటు చెప్పల్ లేదా షూస్ వేసుకుని హాజరు కావాలని నిట్ వరంగల్ నిబంధన పెట్టింది.
అందుకోనున్న 1,997 మంది
విద్యార్థులు
విద్యార్థి జీవితంలో పట్టాల స్వీకరణ కీలక ఘట్టం : నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
నిట్ 24వ స్నాతకోత్సవానికి సిద్ధం
ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇండియా
ఎండీ సంతోశ్‌కుమార్
డిగ్రీ విద్యార్థులు
యూజీ (బీటెక్) 930
పీజీ 945
పీహెచ్‌డీ 100
ఎగ్జిట్ డిగ్రీ 22
(మూడేళ్ల కోర్సు)


