హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవారం మూల మహాగణపతికి లక్ష పుష్పార్చన, శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, పూజలు చేశారు. భక్తురాలు మంజుల అందజేసిన వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు మహేంద్ర కపూర్, రాజ్‌కరాని ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం నృత్యగురువు దేవులపల్లి శ్రీవిద్య శిష్య బృందం కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
హన్మకొండ: ఉపాధి శిక్షణ ద్వారా మహిళలు సాధికారత సాధించవచ్చని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత అన్నారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన కుట్టు, మగ్గం వర్క్‌లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. నూతన బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హనుమకొండ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమ పూజిత హాజరై మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలు పేదరికాన్ని జయించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ ఓరుగంటి రమేశ్, వరంగల్ జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్ట్ కంట్రోల్ కార్యాలయం జిల్లా మేనేజర్ స్వప్న మాధురి, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, సిస్టర్ అల్బాట, ఫైనాన్స్ మేనేజర్ ఎం.అజయ్ కుమార్, ఫీల్డ్ కో–ఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్, ట్రైనర్ స్వప్న, భాగ్యలక్ష్మి, లత పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: పెన్షనర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని డిప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్‌కుమార్ కోరారు. పెన్షనర్ల సంఘాలతో డీటీఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా 93 శాతం మంది ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, పెన్షనర్లు ఇప్పటివరకు 25 శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, మిగతా వారు చేసుకోవాలని కోరారు. వివరాలను https:// ifmis. telangana. gov. in/ pension /#/ ehct& form వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు తూపురాని సీతారాం, ఈ.నరసింహారెడ్డి, కుడూరు గోపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, ఏటీఓలు వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.డి.అన్వర్ హుస్సేన్, ఎస్టీఓలు దయాకర్‌రావు, చంద్రశేఖర్, ఆడిటర్లు ఖాజా, వేణు, సంతోశ్, శశికళ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలంగా పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న సూపరింటెండెంట్లలో ఆరుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించనుంది. కొన్ని నెలల క్రితం 12 మంది సూపరింటెండెంట్లు దరఖాస్తులు చేసుకున్నారు. వారికి రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు సమాచారం. కేయూ పాలక మండలి ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. అయితే, 12 మంది సూపరింటిండెంట్ల విద్యార్హతలకు సంబంధించి విద్యార్హతల సర్టిఫికెట్ల జెన్యూనిటీ కోసం సంబంధిత వర్సిటీలకు కూడా పరిశీలన కు పంపినట్లు సమాచారం. నేడు (శనివారం) కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారు. ఆరుగురి సూపరింటిండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్వర్లులు ఇస్తూనే వారికి వివిధ చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.


