దరఖాస్తుల అమలులో మధ్యవర్తుల హవా | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల అమలులో మధ్యవర్తుల హవా

Sep 10 2026 3:38 AM | Updated on Sep 10 2026 3:38 AM

దరఖాస్తుల అమలులో మధ్యవర్తుల హవా – 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ఘట్కేసర్‌ నుంచి కాజీపేట వరకు మల్టీట్రాకింగ్‌ పనులు

ఘట్కేసర్‌ నుంచి కాజీపేట వరకు మల్టీ ట్రాకింగ్‌ పనులు చేపట్టనున్నారు.

పౌర సేవలు.. నిర్ణీత గడువు

నగరంలో అమలుకు నోచుకోని సిటిజన్‌ చార్టర్‌

అంతులేని జాప్యం ప్రదర్శిస్తున్న అధికారులు!

గ్రేటర్‌ వరంగల్‌వాసులకు తప్పని తిప్పలు

వరంగల్‌ అర్బన్‌: ‘ప్రతీ పౌరుడి ఫిర్యాదుకు జవాబుదారీగా నిలవాలి. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారీగా నిధులతో కూడిన అభివృద్ధి పనులు మినహా పౌర సేవల్లో ఏ ఒక్క వినతి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి. సిటిజన్‌ చార్టర్‌ పక్కాగా అమలు చేయాలి. లేకపోతే జరిమానాలు విధిస్తాం’ అని బల్దియా అధికారులు పదే పదే సమీక్ష సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించట్లేదు. బల్దియా కార్యాలయంలో మొత్తం 15,775 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, పన్నుల విభాగంలో అత్యధికంగా అర్జీలను తొక్కి పెడుతున్నారనే విమర్శలున్నాయి. మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనవుతోందని, అడిగినంత ఇవ్వకపోతే కొర్రీలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.

సమీక్షలేవి.. పరిష్కారమేది?

బల్దియా సేవల్ని సులభతరం చేసేందుకు కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాలున్నాయి. ఈ రెండు సర్కిల్‌ కార్యాలయాలు, బల్దియా ప్రధాన కార్యాలయానికి రోజూ నగర పౌరుల నుంచి ఫిర్యాదులు అందుతాయి. వాటిని పర్సనల్‌ రిజిష్టర్‌ (పీఆర్‌)లో నమోదు చేయాలి. కానీ, నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కమిషనర్‌, అడిషనల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, ఆయా విభాగాల వింగ్‌ అధికారులు వారానికోసారి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కరించాలి. కానీ, నెలకోసారి ఆరాతీస్తూ వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణ కరువు..

కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, విభజన ట్రేడ్‌ లైసెన్స్‌, నల్లా కనెక్షన్ల దరఖాస్తులను పురపాలక శాఖ వైబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఈ దరఖాస్తులు, వీటి పరిష్కారం, పెండింగ్‌ మొత్తం బల్దియాలో ఎక్కడా కనిపించట్లేదు. సెంట్రల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) సంస్థ పర్యవేక్షిస్తోంది. ఎవరైనా దరఖాస్తుదారుడు కార్యాలయానికి వచ్చి తమ దరఖాస్తు ఎందుకు పెండింగ్‌లో ఉందని ఆరా తీస్తే తమ చేతుల్లో ఏమీ లేదని, సీజీజీ సిబ్బందిపి అడిగి చెబుతామని సమాధానం చెబుతున్నట్లు నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ఎన్ని దరఖాస్తులు వాటి స్థితిగతులను ఏంటని అడిగితే తమ వద్ద సమాచారం లేదని ఐటీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిటిజన్‌ చార్ట్‌..

సిటిజన్‌ చార్టర్‌ ఏం చెబుతోందంటే

నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ పత్రాలను, సేవలను అందించేందుకు ప్రభుత్వం సిటిజన్‌ చార్టర్‌ను పక్కాగా అమలు చేస్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ 2019 చట్టంలో స్పష్టంగా పొందుపర్చింది. కానీ, బల్దియాలో అవేమీ పట్టించుకున్న నాథుడే లేడనే విమర్శలున్నాయి. సకాలంలో పైళ్లను పరిష్కరించకపోతే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు, సిబ్బందికి గడువు దాటిన తర్వాత రోజుకు రూ.100 చొప్పున వసూలు చేయాలి. గత 4 ఏళ్ల క్రితం 12 మంది టీపీబీఓలకు జరిమానాలు విధించి రికవరీ చే శారు. కానీ, అధికారుల్లో ఏమాత్రం మార్పు క నిపించలేదు. ప్రజారోగ్యం, పన్నుల విభాగం, ఇంజనీరింగ్‌ అధికారులకు, సిబ్బందికి రూ.50 చొప్పున జరిమానా విధించాలి. ఎన్ని రోజులైనా చార్టర్‌ను పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ముడుపులు అప్పగిస్తేనే ఫైళ్లు పరి ష్కారమవుతున్నాయని ఆరోపణలున్నాయి.

భవన నిర్మాణ అనుమతి ధ్రువీకరణ పత్రం 21 రోజుల్లోగా

ఇవ్వాలి. భవన నివాస యోగ్యత పత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌) 15 రోజుల్లో అందించాలి. ఆస్తి పన్ను మదింపు, పేరు మార్పిడి 15 రోజుల్లో ధ్రువీకరణ పత్రాలివ్వాలి. నల్లా కనెక్షన్‌ 7 రోజులు

ట్రేడ్‌ లైసెన్స్‌ 7 రోజులు రోడ్లపై గుంతలు 24 గంటలు

మ్యాన్‌హోళ్ల మూతలు 24 గంటలు రోడ్డుపై మురుగు, నీటి నిల్వ 2 రోజులు నాలాల్లో ప్రవాహ అడ్డంకులు 2 రోజులు

రోడ్ల పక్కన పూడిక మట్టి 24 గంటలు పుట్‌పాత్‌ మరమ్మతు 3 రోజులు వీధి లైట్లు 24 గంటలు ఇంటిటా చెత్త సేకరణ.. అదే రోజు చెత్త కుప్పలు, వాణిజ్య వ్యర్థాలు అదే రోజు ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం నెలరోజులు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ అదే రోజు జంతు, పక్షి, కళేబరాల తొలగింపు 24 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement