అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

వరంగల్‌ డీఈఓ రంగయ్యనాయుడు

కాళోజీ సెంటర్‌: అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదని, మన జీవితాన్ని మనమే నిర్ణయించుకునే శక్తిని సమాజంలో గౌరవంగా జీవించే అవకాశాన్ని అందించే గొప్ప సాధనమని వరంగల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఓదెల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత లేని జీవితం చీకటితో సమానమన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలోజిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ సదానందం, టాస్‌–ఉల్లాస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ సీహెచ్‌.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..

విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డీఈఓ బి.రంగయ్యనాయుడు సూచించారు. సదరన్‌ ఇండియా సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌–2026లో భాగంగా జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు మంగళవారం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 17 బృందాలు పాల్గొని వైవిధ్యభరితమైన నాటకాలను ప్రదర్శించాయి. ముగింపు కార్యక్రమంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్‌, సైన్స్‌ అధికారి పి.సురేష్‌ బాబు, రెహమాన్‌, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజి కల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు పిన్నింటి బాలా జీరావును మంగళవారం డీఈఓ రంగయ్యనాయు డు, అధికారులు, సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యారంగానికి మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement