డబుల్‌ బెడ్రూం కోసం పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌కు.. | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం కోసం పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌కు..

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

జనగామ: డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు కాలేదన్న మనస్తాపంతో ఓ వృద్ధురాలు పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన శనివారం జనగామలో కలకలం రేపింది. దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన కాంటారి లక్ష్మి తనకు డబుల్‌ బెడ్రూం ఇల్లు రాలేదని ఆవేదన చెందుతూ పెట్రోల్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌కు వచ్చింది. బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను గమనించి వెంటనే అడ్డుకున్నారు. ఎస్సై రతీష్‌ సిబ్బందితో కలిసి ఆమెను పక్కకు తీసుకెళ్లి మా ట్లాడారు. అ ర్హత ఉన్న ప్ర తి ఒక్కరికీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇల్లు కేటాయిస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. దీంతో లక్ష్మి పెట్రోల్‌ బాటిల్‌ ను పోలీసులకు అప్పగించి అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎ లాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడ ంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వృద్ధురాలికి నచ్చజెప్పి పంపిన పోలీసులు

జనగామ కలెక్టరేట్‌లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement