‘కుడా’ చైర్‌పర్సన్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్/నయీంనగర్: సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్ గుండు సుధారాణి హెచ్చరించారు. శుక్రవారం వరంగల్‌లో ఆమె మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడంపై అధిష్టానం మంత్రి పదవి నుంచి ఎమ్మెల్యే కొండా సురేఖను బర్తరఫ్ చేశారన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. అదేవిధంగా సుధారాణి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
నేడు ప్రమాణ స్వీకారం
హనుమకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) కార్యాలయంలో శనివారం చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, హనుమకొండ జిల్లా కలెక్టర్, అధికారులు హాజరుకానున్నారు.


