పోలీస్‌శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత కీలకం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత కీలకం

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

మామునూరు: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 4వ బెటాలియన్‌ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలుస్తోందని, పోలీస్‌ శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత కీలకమని 4వ బెటాలియన్‌ నూతన కమాండెంట్‌ ఎన్‌వీఎస్‌ శ్రీనివాసరావు అన్నారు. వరంగల్‌ మామునూరు తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) 4వ బెటాలియన్‌ నూతన కమాండెంట్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్ల ప్పుడు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు కె. బాలయ్య, వీరన్న, రాజేందర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌, కార్తీక్‌, రాజిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

4వ బెటాలియన్‌

నూతన కమాండెంట్‌ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement