కాజీపేట రూరల్ : కాజీపేట డీజిల్ లోకోషెడ్‌లో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (పీసీఈఈ/ఎస్సీఆర్) జి.వి.మల్లికార్జునరావు ట్రాక్షన్ మోటార్ ట్రయల్ రన్ టెస్టింగ్ ప్యానెల్, అండర్ ట్రాక్ 65–టన్ను క్రేన్, తనిఖీ చక్రాన్ని ప్రారంభించినట్లు స్థానిక అధికారులు తెలి పారు. కాజీపేట రైల్వే డీజిల్ లోషెడ్‌లోని పలు విభాగాలను శుక్రవారం పీసీఈఈ మల్లికార్జున రావు తనిఖీ చేసి సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్, సీనియర్ డీఈఈ హరికృష్ణ, సీనియర్ డీఈఈ సూర్యనారాయణతో మాట్లాడి లోకోల పనితీరు, షెడ్ అభివృద్ధి, ఇతరత్రా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైల్వే పీసీఈఈకి వినతులు..
రైల్వే పీసీఈఈ మల్లికార్జునరావుకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్‌లోకో షెడ్ బ్రాంచ్ సెక్రటరీ పాక వేదప్రకాశ్, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్లు తిరుపతి, యాదగిరి, సహాయ కార్యదర్శులు మహేశ్‌బాబు, నరేశ్‌యాదవ్, కమిటీ సభ్యులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రైల్వే ఓబీసీ సంఘం డివిజన్ సెక్రటరీ ఎ.సంతోష్‌కుమార్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లం రమేశ్, డీజిల్ బ్రాంచ్ సెక్రటరీ కూరపాటి శ్యాం, చైర్మన్ ఆంజనేయులు.. మల్లికార్జునరావుకు కార్మికుల సమస్యపై వినతి పత్రం అందజేశారు. కాగా, కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి మల్లికార్జునరావు సమయం ఇవ్వకపోవడంతో రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బ్రాస్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ
సెంటర్ ప్రారంభం
ఖిలా వరంగల్: మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలు, చేతి వృత్తి కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో నాబార్డు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ శంభునిపేటలో బ్రాస్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ నాబార్డు ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియాంక సైనీ హాజరై కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాబార్డు వరంగల్ డీడీఎం తంగివ చైతన్య రవి, హనుమకొండ నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, మహబూబాబాద్ డీడీఎం సాయిరాం, జనగామ నాబార్డు డీడీఎంటీ, విజయ్‌కుమార్, నాబార్డు ఎం.సువీధి ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ మండల పరశురాములు, మాస్టర్ రాగి భిక్షపతి తదిరులు పాల్గొన్నారు.


