వరంగల్‌లో ప్రతిష్టాత్మక | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో ప్రతిష్టాత్మక

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

వైద్య సదస్సు గర్వకారణం

హన్మకొండ అర్బన్‌ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో టోసా–ఒయాసిస్‌కాన్‌ 2026 ఆర్థోపెడిక్‌ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి ప్రతిష్టాత్మక వైద్య సదస్సులకు వరంగల్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. సీనియర్‌ వైద్యుల అనుభవాన్ని యువ వైద్యులు అందిపుచ్చుకునేందుకు నిరంతరం అభ్యాసన, శిక్షణ అవసరమని తెలిపారు.

ఒయాసిస్‌ అధ్యక్షుడిగా విజయ్‌చందర్‌ రెడ్డి..

సదస్సులో ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ పెసరు విజయ్‌చందర్‌ రెడ్డి ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియన్‌ స్టేట్స్‌ (ఒయాసిస్‌) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ భారత ఆర్థోపెడిక్‌ వైద్యులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆధునిక చికిత్స విధానాలు, పరిశోధనలు, సాంకేతికతపై జ్ఞానాన్ని పంచుకునేలా కృషి చేస్తానన్నారు. యువ వైద్యులకు శిక్షణ, ప్రయోగిక అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు సీనియర్‌ వైద్యులు పాల్గొన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

టోసా– ఒయాసిస్‌కాన్‌ 2026

ఆర్థోపెడిక్‌ సదస్సు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement