బీజేపీని గద్దె దింపే వరకు పోరు | - | Sakshi
Sakshi News home page

బీజేపీని గద్దె దింపే వరకు పోరు

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

బీజేపీని గద్దె దింపే వరకు పోరు

సీపీఐ జాతీయ కార్యదర్శి,

మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: దేశంలోని ప్రజావ్యతిరేక బీజేపీని గద్దె దింపే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వరకు సీపీఐ జిల్లా సమితి నాయకులు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 6న ప్రారంభమైన పాదయాత్ర జిల్లాలో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలే బీజేపీ పతనానికి దారి తీస్తాయని అన్నారు. దేశంలో మార్పు కోసం సీపీఐ పోరాటం సాగిస్తోందని, 12 ఏళ్ల పాలనలో బీజేపీ ఒక్క మంచి పని చేయలేదన్నారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్‌ రాష్ట్ర నాయకుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర సమితి సభ్యుడు సిరబోయిన కరుణాకర్‌, ఆదరి శ్రీనివాస్‌, మండ సదాలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement