హసన్‌పర్తి: భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర శనివారం హసన్‌పర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ పేద ప్రజల వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రూ.రెండు లక్షల కోట్ల అప్పు చేసి సంపదను పెట్టుబడిదారీ వర్గానికి దోచి పెట్టాడని ఆరోపించారు. దోపీడీ వర్గానికి వ్యతి రేకంగా యువత కార్మికవర్గం తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని విభజిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
ఈనెల 14వ తేదీ వరకు ప్రచార యాత్రను కొనసాగించాలని చాడా వెంకట్‌రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, మోతె లింగారెడ్డి, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మిద్దెల ఎల్లేశ్, తోట భిక్షపతి, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు.
వికసిత్ భారత్ పేరుతో
దేశాన్ని విభజిస్తున్నారు
సీపీఐ జాతీయ నాయకుడు
చాడా వెంకట్‌రెడ్డి


