సహజమైన రంగు.. | - | Sakshi
Sakshi News home page

సహజమైన రంగు..

Aug 9 2026 2:34 AM | Updated on Aug 9 2026 2:34 AM

మొక్క నుంచి లభించే సహజ రంగునిచ్చే పదార్థం గోరింట. అలంకరణలో ప్రత్యేకమైంది. భారతీయ సంప్రదాయాల్లో వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆషాఢమాసంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గోరింటాకు పెట్టుకునే సనాతన సంప్రదాయం కొనసాగుతోంది. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. ఈ మాసంలో కొందరు మగవారు కూడా గోరింటాకు పెట్టుకుంటారు.

– చందనాల జ్యోతి, తిలక్‌రోడ్డు, వరంగల్‌

చిట్కాలు పాటిస్తే మరింత ఎరుపు

గోరింటాకు ఎర్రగా పండాలంటే పటిక, చింతపండు, పెరుగు, టీ పొడి ఏదో ఒకటి వేసి ముద్దగా రుద్దుకోవాలి. వివాహ సమయంలో పెళ్లి కుమార్తెలకు మెహందీ పెడుతుంటారు. ఈ సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. చేతులు ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడనేది ఒక నమ్మకమైతే గోరింటాకులో ఉండే ఔషధ గుణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.

– చందనాల పద్మ, కాశిబుగ్గ, వరంగల్‌

గోరింటాకు పెట్టుకోవడమంటే ఇష్టం..

గోరింటాకు పెట్టుకోవడమంటే చిన్నతనం నుంచి ఆసక్తి. గోరింటాకు శుభప్రదమైందిగా భావించి ముఖ్యంగా వివాహ వేడుకల్లో భాగంగా గోరింటాకు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అందంతో పాటు ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటే మంచిదని పోటీ పడి మరీ గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండే వరకు వేచి చూస్తాం.

– రామగిరి జ్యోతి, వరంగల్‌

ప్రకృతి ప్రసాదంగా..

తెలుగు సంస్కృతీసంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రకృతి ఇచ్చిన సంపద గోరింటాకు. ఆధునిక కాలంలోనూ యువతులు గోరింటాకు ఇష్టపడుతున్నారంటే సంప్రదాయమంటే గౌరవం. ఔషధ గుణాలు ఉండడమే కారణం. రసాయనాలు ఉపయోగించే కోన్స్‌ వాడడం కంటే ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు ఉపయోగించుకోవడం శ్రేష్టం.

– సంఘ జీవనజ్యోతి, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement