పేదబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పేదబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

Jul 27 2026 3:00 AM | Updated on Jul 27 2026 3:00 AM

హన్మకొండ కల్చరల్‌: రాష్ట్రంలోని పేదబ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.వందకోట్ల బడ్జెట్‌ రానుందని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు బ్రాహ్మణ సేవాసమితి, శ్రీవైష్ణవ సేవా సమితి, విప్ర బ్రాహ్మణ సేవాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బ్రాహ్మణభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పేదబ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ సంఘాలు నిబద్ధతతో పనిచేయాలని, అన్ని కులాలతో మమేకమై నడవాలని సూచించారు. పేద వేదపండితులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని ట్రస్ట్‌లో తీర్మానం చేశామని, వివేకానంద స్కీం, విదేశీ విద్యా పథకం, వ్యాపారాలు చేసుకోవడానికి గ్రాంట్‌ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యప్రసాద్‌ను సన్మానించారు. సమావేశంలో బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్‌ శ్రీనివాసాచారి, వేదపండితులు విజయకుమారాచార్యులు, విప్ర బ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ వల్లూరి పవన్‌కుమార్‌, వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్‌ తిరువరంగం ప్రభాకరాచారి, చకిలం సుధాకర్‌రావు, శ్రీధరాచార్యులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌

ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement