గ్రూపు రాజకీయాలకు తావు లేదు | - | Sakshi
Sakshi News home page

గ్రూపు రాజకీయాలకు తావు లేదు

Jul 27 2026 3:00 AM | Updated on Jul 27 2026 3:00 AM

పరకాల: రానున్న ఎన్నికల్లో పరకాల గడ్డపై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆదివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుతో రాజకీయాలు చేసే వారు దూరంగా ఉండండి, నిబద్ధతతో పనిచేసే వారే తనతో ఉండాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పరకాల నియోజకవర్గానికి నాలుగో స్థానం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏలు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పార్టీ నాయకులను ఆయన అభినందించారు. అన్ని మండలాల్లో 100 శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను సహించనని, అధిష్టానం చెప్పిందే సుప్రీం అని స్పష్టం చేశారు. నామిటెడ్‌, పార్టీ పదవుల్లో టీం సభ్యులకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యంమన్నారు. సమావేశంలో పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చందు, పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్‌, నడికూడ, పరకాల మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పరకాలలో మరోసారి కాంగ్రెస్‌దే గెలుపు

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement