ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Jul 27 2026 3:00 AM | Updated on Jul 27 2026 3:00 AM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని స్టేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌టీయూ) రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు మాలోత్‌ గణపతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హనుమకొండలోని ఎస్‌టీయూ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీ ప్రకటించాలని, ఐదు డీఏలు విడుదల చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు భీమనాథుని రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. రాష్ట్ర పూర్వ ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, వరంగల్‌ జిల్లా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మూల మధుమాలిమాయే, జిల్లా ప్రధాన కార్యదర్శి దానం నాగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేమునూరి రాంబాబు, ఆర్థిక కార్యదర్శి శవకోటి, జిల్లాల కార్యవర్గసభ్యులు ఆర్‌.సుధాకర్‌, కిషన్‌, ఖలీల్‌పాషా, శ్రీను, నిరంజన్‌, రజనీకాంత్‌, వెంకన్న, సోమయ్య, శేషాచారి, సాంబమూర్తి, చీకటి శ్రీనివాస్‌, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

ఎస్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు గణపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement