గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

నేడు కేటీఆర్‌ రాక ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో భద్రకాళి అమ్మవారు నేడు కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా అన్యాక్రాంతమైన భూములు నమోదు చేయాలి.. వృథాగా నీరు..

న్యూస్‌రీల్‌

ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు

హన్మకొండ: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వ కుంట్ల తారక రామారావు గురువారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23న (నేడు) మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్‌లో పోచంపల్లి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 10.30 గంటలకు సత్యసాయి కన్వెన్షన్‌కు చేరుకుంటారు.

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం అమ్మవారిని ఉగ్ర ప్రభ, త్వరితా క్రమాల్లో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని ఉగ్రప్రభ క్రమంలో, షోడశీక్రమంలో బోగభేరాన్ని త్వరితాక్రమంలో అలంకరించి చతుఃస్థానార్చన పూజలు జరిపారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం యశ్వంత్‌పూర్‌–కోటా వయా కాచిగూడ మీదుగా నడిపిస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్‌ తెలిపారు. నేడు గురువారం యశ్వంత్‌పూర్‌–కోటా (06591) వెళ్లే వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌ కాజీపేట జంక్షన్‌ చేరుకొని వెళ్తుంది. ఈ స్పెషల్‌ ట్రైన్‌కు యెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, డోన్‌, కర్నూలు సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, షీహోర్‌, సుజల్‌పూర్‌, బెర్చా, ఉజ్జయిని, నాగ్‌డా, విక్రమ్‌ఘర్‌, ఆలోట్‌, చామహాల, షామ్‌ఘర్‌, భవానీ మండిలో హాల్టింగ్‌ కల్పించారు.

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 25న నిర్వహించాల్సిన ఫార్మ్‌ డీ మూడో సంవత్సరం పరీక్షలు, ఈనెల 24న జరగాల్సిన ఫార్మ్‌ డీ నాలుగో సంవత్సరం పరీక్షలు, అదే రోజు జరగాల్సిన ఎంఈడీ నాలుగో సెమిస్టర్‌, ఈనెల 25న జరగాల్సిన బీటెక్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌, బీఫార్మసీ నాన్‌సీబీసీఎస్‌ మూడో సంవత్సరం మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు.

ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ

అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత

హన్మకొండ కల్చరల్‌: దేవాలయాల అన్యాక్రాంతమైన భూముల గురించి, అర్చకులు అమ్ముకున్న భూముల గురించి, సీసీఎల్‌ఏ గుర్తించిన భూములను దేవాదాయశాఖలో నమోదు చేయాలని వరంగల్‌ ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత ఆదేశించారు. ఈమేరకు బుధవారం వరంగల్‌ దేవాదాయశాఖ కార్యాలయంలో దేవాదాయశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్లతో, కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీ రామల సునీత మాట్లాడుతూ.. మండల ఇన్‌చార్జ్‌ పరిధిలో ఉన్న భూముల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ భూముల ద్వారా లీజు వసూలు చేయాల్సిందిగా, అనధికారికంగా కౌలు చేసుకుంటున్న కౌలుదారుల నుంచి కౌలు వసూలు చేయలేని పక్షంలో ఆక్రమణదారులను గుర్తించి వారిపై ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేయాలని ఆదేశించారు.

కాజీపేట అర్బన్‌: దేశంలో ఇప్పుడన్నింటికీ ఆధారే ఆధారమైంది. అదే ఆ చిన్నారులకు అతి పెద్ద శాపంగా మారింది. తమ వయస్సు పిల్లలంతా భుజానికి బ్యాగేసుకుని బడికెళ్తుంటే.. ఆ చిన్నారులు మాత్రం చిన్నబోయి చూస్తున్నారు. స్కూల్లో చేరాలంటే యూడైస్‌లో పేరు నమోదు చేయాలి. అలా పేరు నమోదు కావాలన్నా.. పెన్‌ ఐడీ, అపార్‌ ఐడీ, ఇలా ఏది జనరేట్‌ చేయాలన్నా.. ఆఖరుకు యూనిఫాం ఇవ్వాలన్నా ఆధార్‌ కార్డు కంపల్సరీ కావడంతో కాజీపేట మండల పరిధి చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు.

బర్త్‌ సర్టిఫికెట్‌ లేక.. ఆధార్‌ రాక

కాజీపేట మండలం మడికొండలోని మెట్టుగుట్ట దేవాలయం వెనుకాల అయోధ్యపురం వెళ్లే రోడ్డులో కొన్నేళ్ల క్రితం ఎంఎన్‌నగర్‌ పేరిట గుడిసెలు వేసుకుని బుడిగజంగాల కమ్యూనిటీకి చెందిన సుమారు 350 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. కాగా, వీరిలో 64 కుటుంబాలకు చెందిన 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు 37 మంది బర్త్‌ సర్టిఫికెట్‌ లేదనే కారణంతో విద్యకు దూరమ య్యారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. కొత్తగా ఆధార్‌ కార్డు తీయాలంటే డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ కంపల్సరీ. సాధారణంగా ఆస్పత్రిలో శిశువు జన్మిస్తే.. హాస్పిటల్‌ డిశ్చార్జ్‌ సమ్మరీ ఆధారంగా మీసేవలో దరఖాస్తు పెట్టుకుంటే మున్సిపల్‌ కార్యాలయం నుంచి డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ ఇష్యూ అవుతుంది. దాని ఆధారంగా చిన్నారులకు ఆధార్‌ కార్డు తీయవచ్చు. కానీ, ఎంఎన్‌నగర్‌కు చెందిన చిన్నారులు ఇళ్లల్లో జన్మించడం, వారి తల్లిదండ్రులు బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోకపోవడం కారణంగా చిన్నారులకు ఆధార్‌ కార్డు రావట్లేదు. వీరి తల్లిదండ్రులు పేపర్లు, స్క్రాప్‌ను ఏరుకునే వృత్తిలో ఉండడం, నిరక్షరాస్యులు కావడంతో ఎక్కడికి వెళ్తే.. ఏయే డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటే ఆధార్‌ కార్డు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన చెందుతూ ఆధార్‌ కార్డులు ఇప్పించాలని ఇప్పటికే చాలా సార్లు కలెక్టర్‌, తహసీల్దార్‌కు వినతులు అందజేశారు.

ఆధార్‌ ఇవ్వండి.. చదువుకోనివ్వండి

మా పిల్లలకు 12 ఏళ్లు వచ్చినా ఆధార్‌ కార్డులు లేక బడిలో చేర్పించలేదు. ఎంఎన్‌నగర్‌ పిల్లలకెవరికీ బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. దీంతో ఆధార్‌కార్డు రావట్లేదు. కలెక్టర్‌, తహసీల్దార్‌ చొరవ తీసుకుని ఆధార్‌ కార్డులు ఇప్పించాలి. మా పిల్లలకు చదువును అందించాలి.

– కడమంచి కనకమ్మ, ఎంఎన్‌ నగర్‌

నువ్వు మా బడిలోకి రాలేవు..

బడిలో చేరేందుకు వెళ్తే.. నువ్వు మా బడిలోకి రాలేవు.. నీకు ఆధార్‌ కార్డు లేదు అని సార్లు రానిస్తలేరు. నా తోటి మిత్రులు నాలుగో తరగతిలో ఉన్నారు. నేను మాత్రం చదువులేక ఇంట్లోనే ఉంటుండగా.. మాకోసం ఏర్పాటు చేసిన డాన్‌ బాస్కో స్కూల్‌లో చేరాను.

– ఏసు, ఎంఎన్‌ నగర్‌, మడికొండ

ఇంటింటికీ వెళ్లి తీసుకొస్తున్నాం..

ప్రతీ రోజు ఇంటింటికీ వెళ్లి పిల్ల లను బడికి తీసుకొస్తాం. నేను ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ను బోధిస్తాను. చిన్నారులకు పూర్వ విద్యలేనందున్న బేసిక్స్‌ నేర్పిస్తున్నాను. ఏడాదిగా ప్రతీ రోజు పాఠశాలకు సంతోషంగా పిల్లలు వస్తున్నారు. పాఠ్యాంశాలను ఇష్టంగా నేర్చుకుంటున్నారు.

– కేజియా, ఇంగ్లిష్‌ టీచర్‌

వరంగల్‌ 12వ డివిజన్‌లోని ఫిల్టర్‌ బెడ్‌ నుంచి లక్ష్మీ గార్డెన్‌ వైపు వచ్చే మెయిన్‌ పైప్‌లైన్‌ బుధవారం లీకయ్యింది. దీంతో తాగునీళ్లు పౌంటేన్‌ మాదిరిగా ఎగజిమ్మాయి. పాతకాలం నాటి పైప్‌లైన్‌ దెబ్బతినడంతో తాగునీళ్లు పొంగిపొర్లుతూ వృథాగా పోయాయి. – కాశిబుగ్గ

ఆధార్‌ కార్డులేక బడికి

దూరమవుతున్న చిన్నారులు

అక్షరాలు నేర్పుతూ ఔదార్యం

చాటుతున్న డాన్‌ బాస్కో సంస్థ

బడిలో చేరేందుకు ఎదురుచూస్తున్న మడికొండలోని ఎంఎన్‌ నగర్‌ బాలలు

ఆధార్‌కార్డు ఇప్పించాలని కలెక్టర్‌, తహసీల్దార్‌కు వినతులు

ఏసీబీ దాడులకూ వెరవని అవినీతి అధికారులు

రవాణా, ఎకై ్సజ్‌, రెవెన్యూ శాఖల్లో

’ప్రైవేట్‌ వ్యక్తుల’ రాజ్యం

అక్రమ వసూళ్లకు కొత్త ఎత్తుగడ

ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 65 ఏసీబీ కేసులు.. అయినా మారని కొందరి తీరు

న్యూశాయంపేట: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రీజినల్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ డీఎస్‌ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని బాలుర పాఠశాల, నర్సంపేటలో బాలుర పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27న సరైన ధ్రువపత్రాలతో వరంగల్‌ చింతల్‌ బ్రిడ్జి వద్ద యాకుత్‌పురాలోని బాలుర పాఠశాలలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన కోరారు.

చదువును పరిచయం చేసిన

డాన్‌ బాస్కో సంస్థ

మడికొండలోని ఎంఎన్‌నగర్‌ కాలనీలోని 5 నుంచి 12 ఏళ్లలోపు బాలలకు విద్యనందించాలనే లక్ష్యంతో గతేడాది మే 5వ తేదీన వేసవిలో ఎంఎన్‌ నగర్‌లోని ఓ చర్చి ఆవరణలో డాన్‌ బాస్కో నవజీవన్‌ వరంగల్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన క్యాంపులో 37 మందికి పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాంపులో ఇద్దరు టీచర్లు, ఒక కౌన్సిలర్‌ ఉన్నారు. గణితం, తెలుగు, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లను బోధిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పాఠశాల నడుస్తోంది. మధ్యాహ్న భోజనం, బుక్స్‌, యూనిఫాంలతో పాటు ఉచితంగా వైద్యం అందజేస్తున్నట్లు డాన్‌ బాస్కో నవజీవన్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ థామస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement