31లోపు ఈ–కేవైసీ పూర్తిచేయాలి : కిష్టయ్య | - | Sakshi
Sakshi News home page

31లోపు ఈ–కేవైసీ పూర్తిచేయాలి : కిష్టయ్య

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

31లోపు ఈ–కేవైసీ పూర్తిచేయాలి : కిష్టయ్య

ఖిలా వరంగల్‌: రేషన్‌షాపుల్లో కార్డుదారులు ఈనెల 31లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలని వరంగల్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్‌ఓ) కిష్టయ్య సూచించారు. హనుమకొండలోని వరంగల్‌ జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో బుధవారం డీలర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎస్‌ఓ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్‌కార్డులోని ప్రతీ సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. గతంలో చేసిన వారు ఆందోళన పడొద్దని, ఈ–కేవైసీ చేయని వారు సమీప రేషన్‌ దుకాణాలకు వెళ్లి పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 80 శాతానికి పైగా లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తిచేశారని, మిగిలినవి వెంటనే పూర్తిచేయాలని కోరారు. సమావేశంలో సివిల్‌ సప్లయీస్‌ డీటీ కిరణ్‌కుమార్‌ వివిధ మండలాల రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement