సాక్షి ప్రతినిధి, వరంగల్:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తూ లంచగొండి అధికారులను పట్టుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏసీబీ వలలో అధికారులు చిక్కుతున్నా, మరుసటి రోజు అదే కార్యాలయాల్లో అక్రమ వసూళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రవాణా, ఎకై ్సజ్, పోలీస్, రెవెన్యూ శాఖల్లోని కొందరు అధికారులు డబ్బులు తీసుకోకుండా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపైనా కొందరిపై విమర్శలు ఉన్నాయి. అయితే నేరుగా చేతితో ముట్టకుండా.. ఆయా శాఖల్లోని వారి తరఫున ‘ప్రైవేట్ వ్యక్తులు‘, మధ్యవర్తులు వసూళ్లు నిర్వహించడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది.
అధికారులు లోపల, వసూళ్లు బయట..
వరుస దాడులతో మారిన వ్యూహం
ఏసీబీ వరుసగా ట్రాప్‌లు నిర్వహించి పలువురు అధికారులను అరెస్ట్ చేస్తోంది. దీంతో నేరుగా లంచం తీసుకోవడం ప్రమాదమని భావించిన కొందరు అధికారులు నేరుగా డబ్బులు ముట్టుకోవడం తగ్గించారు. బదులుగా తమకు అత్యంత సన్నిహితులైన ప్రైవేట్ వ్యక్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, దళారులను రంగంలోకి దింపుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలనుంచి వీరే రేట్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖలో వాహనాల తనిఖీలు, ఫిట్‌నెస్, పర్మిట్లు, ఓవర్‌లోడ్ వాహనాల వ్యవహారాల్లో నిబంధనల కంటే సెటిల్‌మెంట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఎకై ్సజ్‌లో సిండికేట్..
రెవెన్యూలో దళారుల దందా
బెల్ట్‌షాపులు, అక్రమ మద్యం, బార్ల తనిఖీలు, లైసెన్సు అంశాల్లో మధ్యవర్తుల పాత్ర పెరిగిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నెలవారీ వసూళ్ల వ్యవస్థ కొనసాగుతోందని, అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే వ్యవహారాలు ముగుస్తున్నాయని చెబుతున్నారు. రెవెన్యూశాఖలో మ్యుటేషన్లు, వారసత్వ ధ్రువీకరణలు, భూ వివాదాలు, పాస్‌బుక్‌లు, ఎన్‌ఓసీలు వంటి పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ముందుగానే దళారులు సంప్రదిస్తున్నారని సమాచారం. పోలీసుశాఖలో కొందరు అధికారులు ప్రైవేట్ డ్రైవర్లు, గన్‌మెన్‌లు, హోంగార్డులను వాడి వసూలు ఘటనలు పలు కేసుల్లో బయటపడిన సంగతి తెలిసిందే.
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చే యాలి. అవినీతి అధికారుల సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. ట్రోల్‌ఫ్రీ నంబర్ 1064కు, వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నంబర్ 91543 88912కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
– పి.సాంబయ్య, డీఎస్పీ, ఏసీబీ, వరంగల్
(జులై 22
వరకు)
ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో
ఏసీబీ కేసులు ఇలా..
ఈ ఏడాది జనవరిలో కేయూసీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ ఎస్‌ఐ ప్రైవేట్ డ్రైవర్ నజీర్‌తో కలిసి చార్జ్‌షీట్ దాఖలు, వాహనాల విడుదలకు రూ.15 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అయినప్పటికీ తాజాగా సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ ఠాణా అధికారులు మహిళలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఓ ఎకై ్సజ్ కానిస్టేబు ల్‌ను పట్టుకుని డబ్బులు తీసుకుని వదిలేయడం చర్చనీయాంశం అవుతోంది.
గతంలో హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా, ఇన్‌చార్జ్ డీఈఓగా ఉన్న వెంకట్‌రెడ్డి లంచం తీసుకోవడంతోపాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతకుముందు ఇద్దరు తహసీల్దార్లు కూడా ఏసీబీకి చిక్కారు. అయినప్పటికీ వరంగల్ నగరం చుట్టూ ఉన్న ఐదారు మండలాల రెవెన్యూ అధికారులు కొందరు నాలా కన్వర్షన్, సాదాబైనామాలు, రిజిస్ట్రేషన్లకు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


