పూలే విగ్రహం వద్ద మాట్లాడుతున్న ఎంపీ కావ్య, పక్కన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,
కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద తదితరులు
రామన్నపేట : జ్యోతిరావుబా పూలే మహిళల అభివృద్ధికి విశేష కృషి చేశారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే జయంతిని పురస్కరించుకుని ములుగు క్రాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎంపీ కావ్యతోపాటు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రెండు జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యమిస్తూ సమాజంలో కొత్త మార్గాలను చూపించిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక కులగణనను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. సేకరించిన డేటాను అసెంబ్లీలో ప్రవేశపట్టడం ద్వారా తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య


