స్టేక్‌ హోల్డర్లను భాగస్వామ్యం చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్టేక్‌ హోల్డర్లను భాగస్వామ్యం చేయాలి

Apr 12 2026 2:18 AM | Updated on Apr 12 2026 2:18 AM

స్టేక్‌ హోల్డర్లను భాగస్వామ్యం చేయాలి

వరంగల్‌ అర్బన్‌: మహా నగరంలో భూగర్భ డ్రెయినేజీ డీపీఆర్‌, క్షేత్ర స్థాయి పరిశీలనపై స్టేక్‌ హోల్డ ర్లను భాగస్వామ్యం చేస్తూ, అభిప్రాయాలు స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్‌ గ్రేటర్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. గత రెండు రోజులుగా జర్మనీకి చెందిన కన్సల్టెన్సీ బృందం ప్రతినిధులు నగరంలో క్షేత్రస్థాయిలో భూగర్భ డ్రెయినేజీపై సేకరించిన అభిప్రాయాలు, నివేదికపై ఇంజనీర్లతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ప్రాథమిక నివేదికపై సమాలోచనలు చేశారు. నగరంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించాలని కోరారు. సమావేశంలో జర్మనీ ప్రతినిధుల బృందం సభ్యులు డాక్టర్‌ రావు పరిమల్‌, ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రావు, ప్రధాన ఆరోగ్య అధికారి రమేశ్‌, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీంద్ర రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఆరోగ్య అధికారి డాక్టర్‌ రాజేశ్‌, కార్యనిర్వాహక ఇంజనీర్లు మహేందర్‌, రవికుమార్‌, మాధవీలత, సంతోశ్‌బాబు పాల్గొన్నారు.

డ్రగ్స్‌ నియంత్రణ బలోపేతంపై అవగాహన

హనుమకొండ కలెక్టరేట్‌లోని ఐడీఓసీ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్‌ నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ చాహత్‌ బాజాపాయ్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య, ఈగల్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జర్మనీ కన్సల్టెన్సీ, ఇంజనీర్లతో

సమావేశం

హనుమకొండ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement