శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆలస్యానికి అనేక

సాకులు

– 8లోu

మొత్తం ప్రాజెక్టులు :

సుమారు 119

పూర్తయినవి :

సుమారు 66% మాత్రమే

(2025 మధ్య నాటికి)

ప్రగతిలో : 66 పనులు

(రూ.518 కోట్ల విలువ)

‘గ్రేటర్‌’లో ‘స్మార్ట్‌’ పనులు ఇంకా పెండింగ్‌

జేపీఎన్‌రోడ్డులో స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా పూర్తి చేయని ఫుట్‌పాత్‌

పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ పూర్తి కాకపోవడానికి అధికారులు వివరణలో అనేక కారణాలు చూపుతున్నారు. మొదట భూ సేకరణ సమస్యలు కారణమని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత టెండర్‌/కాంట్రాక్టర్‌ ఆలసత్వం, తరచూ అధికారులు మారడం (స్థిరత్వం లేకపోవడం), విభాగాల మధ్య సమన్వయం లోపం తదితర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుత పనుల వేగాన్ని బట్టి చూస్తే ఏప్రిల్‌ నెలాఖరులోనైనా పెండింగ్‌ పనులు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు గడువు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్‌ తర్వాత మరోసారి పొడిగింపు ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే స్మార్ట్‌ సిటీగా వరంగల్‌ను తీర్చిదిద్దే లక్ష్యం ఇంకా కాగితాలపైనే ఉండగా, క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ‘రోడ్లు తవ్వి వదిలేశారు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పడం లేదు. ట్రాఫిక్‌, దుమ్ముతో జీవించడం కష్టంగా మారింది’ అంటూ హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్మార్ట్‌ సిటీ అంటే సౌకర్యాలు రావాలి. కానీ, ఇబ్బందులే పెరిగాయి’ అంటూ కాజీపేట నివాసి ఒకరు అభిప్రాయపడ్డారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన భద్రకాళి బండ్‌ పనులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

డెడ్‌లైన్లు పెరుగుతున్నాయే తప్ప వరంగల్‌ నగరంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ (ఎస్‌సీఎం) పూర్తి కావట్లేదు. స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందాల్సిన గ్రేటర్‌ వరంగల్‌లో పనులు ఇంకా పూర్తి స్థాయిలో ముగియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరుసగా గడువు పొడిగించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఆశించిన వేగంతో సాగట్లేదు. 2026 మార్చి గడువు సైతం ముగిసినా వందశాతం పనులు కాకపోవడంతో ఈనెలాఖరులోనైనా పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు అందిన్నట్లు సమాచారం.

మూడేళ్ల కిందటే పూర్తి కావాల్సి ఉన్నా..

రాష్ట్రంలో గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌ నగరాలు స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద ఎంపికయ్యాయి. మార్చి 16న స్మార్ట్‌ సిటీలపై కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.2,895 కోట్ల వ్యయంతో మొత్తం 168 ప్రాజెక్టులను మంజూరు చేయగా, వీటిలో రూ.2,520 కోట్ల విలువైన 143 ప్రాజెక్టులు (85 శాతం) ఏడాదిన్నర క్రితమే పూర్తయ్యాయి. వరంగల్‌ కార్పొరేషన్‌లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో రూ.375 కోట్ల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం మొదట ఇచ్చిన గడువు 2023. ఆతర్వాత 2024, 2025 మార్చి 31 వరకు పెంచింది. అప్పటికీ 66 శాతం వరకే పూర్తి కావడంతో ప్రత్యేకంగా వరంగల్‌ కోసం 2025 డిసెంబర్‌ 31 వరకు మరోసారి ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చింది. తాజాగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్‌ సాహూ మార్చి 16న రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గడు వు దాటినప్పటికీ గ్రేటర్‌ వరంగల్‌లో రూ.375 కోట్ల వ్యయం కాగల 25 ప్రాజెక్టులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో 2026, మార్చి 31వ తేదీ వరకు మరోసారి గడువు ఇచ్చినా పూర్తికాలేదు.

పోతనగర్‌లో ఆగుతూ సాగుతున్న డ్రెయిన్‌ బ్రిడ్జి పనులు

సునీల్‌ థియేటర్‌ ముందు అండర్‌ డ్రెయినేజీ వేసి

దానిపై నిర్మించని ఫుట్‌పాత్‌

గ్రేటర్‌ వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు ఇలా..

2026 నాటికి గ్రౌండ్‌ రియాలిటీ

ఈ నెలాఖరులోగా

పూర్తి చేయాలని ఆదేశం

నిధుల మళ్లింపుపై ఇప్పటికే

‘కాగ్‌’ అక్షింతలు

స్మార్ట్‌ సిటీ పనుల్లో డొల్లతనంపై అభ్యంతరాలు

బాధ్యతారహితంగా అధికారులు.. ఏడాదిగా పనుల సాగదీత

దారిమళ్లిన నిధులపై కాగ్‌ అంక్షింతలు

జీడబ్ల్యూఎంసీలో అమృత్‌ పథకంతో సంబంధం లేని రోడ్డు పనులు, టీ–ఫైబర్‌ ప్రాజెక్టు పనుల కోసం ‘మిషన్‌’ నిధులనుంచి రూ.21.30 కోట్లు చెల్లించడంపై కాగ్‌ ప్రశ్నించింది. మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి చెల్లించాల్సిన సిమెంట్‌, ఇనుము ధరల సర్దుబాటు కోసం రూ.8.60 కోట్లు అమృత్‌ నిధులు వాడడం కూడా నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంది. నీటి సరఫరా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్‌కు అక్రమంగా లబ్ధి చేకూర్చమేంటని ప్రశ్నించింది. పెట్రోల్‌, ఆయిల్‌, లూబ్రికెంట్స్‌ లీటరుకు రూ. 64.36 ఉండగా, తప్పుగా రూ.62.46గా తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్‌కు రూ.1.05 కోట్లు అదనంగా చెల్లించడంపై మండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement