హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ కమిటీ సమావేశంలో మేఘా గ్యాస్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో చేపట్టనున్న గ్యాస్ సరఫరా విధానం, పైపులైన్ ఏర్పాట్లు, గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు నమోదైన కనెక్షన్లు, సబ్సిడీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసే విధానం, సంబంధిత పోర్టల్‌పై ప్రజలకు వివరించాలని సూచించారు. వీటికి సంబంధించి అనుమతుల సమన్వయం కోసం పరిశ్రమలశాఖ జీఎం నవీన్‌కుమార్‌ను నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, మేఘా గ్యాస్ జిల్లా మేనేజర్ అవినాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ నివారణకు విస్తృత
అవగాహన కార్యక్రమాలు
రామన్నపేట: హెచ్‌ఐవీపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన పెంచడానికి కార్యక్రమాలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీపై అవగాహన కల్పించేందుకు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి అదాలత్ జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షితమైన జీవన విధానంతో హెచ్‌ఐవీ నివారణ సాధ్యమన్నారు. అనంతరం అదాలత్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మదన్ మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహె చ్‌ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ రుబీనా, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.


