అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

అవగాహనతోనే ఎయిడ్స్‌ నివారణ

కాశిబుగ్గ/రామన్నపేట: అవగాహన, సురక్షిత జీవ న విధానంతోనే ఎయిడ్స్‌ నివారణ సాధ్యమని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిలో భాగంగా గురువారం కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తమార్పిడి, కలుషిత సూదులు/సిరంజిల వినియోగం ద్వారా వ్యాపించే ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్‌, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంజీఎం కూడలి వద్ద ఏవీవీ స్కూల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ మాజీ ఆఫీసర్‌ కొడిమాల శ్రీనివాసరావు, స్టేట్‌ రిసోర్స్‌పర్సన్‌ రెడ్‌ రిబ్బన్‌ క్లబ్స్‌, యూత్‌ ఫర్‌ సొసైటీ రూపొందించిన 87 ఫీట్ల రెడ్‌రిబ్బన్‌, రక్త బిందువు, ఎయిడ్స్‌ సింబల్స్‌తో ర్యాలీ నిర్వహించారు.

‘అరైవ్‌–అలైవ్‌’ అమలుపై సమీక్ష

న్యూశాయంపేట: అరైవ్‌–అలైవ్‌ అమలుపై గురువారం హైదరాబాద్‌ సచివాలయం నుంచి సీఎస్‌ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. వరంగల్‌ నుంచి కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కేఎంసీ నుంచి ఎంజీఎం వరకు ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement