● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు కల్గకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్టిబ్య్రూషన్ ఏజెన్సీల యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితి, వినియోగదారులకు అందుతున్న సిలిండర్లపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి చర్చించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు నారాయణ, రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీసీఎస్‌ఓ ఎండీ.వాజీద్ అలీ, బీపీసీఎల్ వరంగల్ మేనేజర్ సాహిల్ ధోబ్లె తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. జిల్లాలో 68.56 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, హనుమకొండ, పరకాల తహసీల్దార్లు రవీందర్‌రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలి..
¯]lƇʅ¯]lVýSÆŠḥæ: నగర పరిధి చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం ‘కుడా’ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’, ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇందులో ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇరిగేషన్, ‘కుడా’, బల్దియా అధికారులు కిరణ్ కుమార్, భీమ్ రావు, మహేందర్, సంతోశ్‌బాబు, ఇరిగేషన్ డీఈ హర్షవర్ధన్, ఎన్‌ఐటీ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు పాల్గొన్నారు.
గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్ ఎన్.రవి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.


