క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

Mar 14 2026 10:18 AM | Updated on Mar 14 2026 10:18 AM

హనుమకొండ జిల్లా క్షయ

నియంత్రణాధికారి హిమబిందు

ఎంజీఎం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ హిమబిందు అన్నారు. మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకతీయ మెడికల్‌ కాలేజీ నర్సింగ్‌ కళాశాలలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ.. టీబీని నివారించడం కంటే ముందుగా దాన్ని గుర్తించడం ముఖ్యమని, ప్రాథమిక దశలో గుర్తించి తగు చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రివచ్చన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ టి.సునీత, నర్సింగ్‌ ట్యూటర్స్‌ అనురాధ, సుకన్య, జిల్లా క్షయ వ్యాధి టీబీ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్లు సుష్మా, కిరణ్‌ కుమార్‌, నగేశ్‌, సీనియర్‌ ట్రీట్మెంట్‌ సూపర్‌వైజర్‌ విజయ్‌, సతీశ్‌, హెల్త్‌ విజిటర్స్‌ అంజమ్మ, సునీత, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ సందర్శన

హసన్‌పర్తి: హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజర్‌ ప్రతినిధి డాక్టర్‌ శిరీష సందర్శించారు. ఈసందర్భంగా కుష్ఠువ్యాధి డిటెక్షన్‌ సర్వే నిర్వహించారు. పైలేరియా, కుష్ఠు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ రామ్‌ భార్గవ్‌, డాక్టార్‌ భరత్‌, హెచ్‌ఈఈఓ సందెల శ్రీనివాస్‌, డీపీఎంఓలు రవీందర్‌, సతీష్‌రెడ్డి, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ ఖాదర్‌ అబ్బాస్‌, విప్లవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement