తల్లి మరణం తట్టుకోలేక.. | - | Sakshi
Sakshi News home page

తల్లి మరణం తట్టుకోలేక..

Jan 25 2026 6:47 AM | Updated on Jan 25 2026 6:47 AM

తల్లి మరణం తట్టుకోలేక..

తల్లి మరణం తట్టుకోలేక..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ఖిలా వరంగల్‌: తల్లి మరణం తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌– చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ధర్మారం రైల్వేగేట్‌ స మీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌. రవీందర్‌రెడ్డి కథనం ప్ర కారం.. గీసుగొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పర్ష స్వామి(65) తల్లి గతేడాది క్రితం మృతి చెందింది. శుక్రవారం సంవత్సరీక కార్యక్రమం నిర్వహించాడు. తల్లిని గుర్తు చేసుకుని జీవితంపై విరక్తి చెంది అదేరోజు రాత్రి ధర్మారం రైల్వేగేట్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించిన అనంతరం మృతుడి కుమారుడు రాజుకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ రెడ్డి శనివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement