థర్డ్‌లైన్‌ వర్క్స్‌.. | - | Sakshi
Sakshi News home page

థర్డ్‌లైన్‌ వర్క్స్‌..

Jan 25 2026 6:47 AM | Updated on Jan 25 2026 6:47 AM

థర్డ్

థర్డ్‌లైన్‌ వర్క్స్‌..

పలు రైళ్లు రద్దు, మరికొన్ని పాక్షికంగా..

కాజీపేట రూరల్‌ : కాజీపేట –బల్లార్షా సెక్షన్‌లో మందమర్రి–బెల్లంపల్లి మధ్య జరుగుతున్న మూడో రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా చేపట్టిన నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో పలు రైళ్లను ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు శనివారం రాత్రి తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

కాజీపేట–సిర్పూర్‌టౌన్‌ (17003) ఎక్స్‌ప్రెస్‌, బల్లార్షా–కాజీపేట (17004) మెము ప్యాసింజర్‌, బల్లార్షా–కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్‌, కాజీపేట–బల్లార్షా (17035) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. భద్రాచలంరోడ్‌–బల్లార్షా (17033) సింగరేణి, సిర్పూర్‌టౌన్‌–భద్రాచలంరోడ్‌ (17034) సింగరేణి ప్యాసింజర్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

భద్రకాళి అమ్మవారికి పూజలు

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. దేవాలయ అర్చకులు వారిని స్వాగతించి పూజల అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం దేవాదాయశాఖ వరంగల్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఈఓ రామల సునీతను దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ డాక్టర్‌ బండారు శివసుబ్రహ్మణ్యం, సభ్యులు ఘనంగా సన్మానించారు. అర్చకులు శేషు, ధర్మకర్తలు వీరన్న, శ్రవణ్‌కుమార్‌, పూర్ణచందర్‌, మయూరి, సుగుణ, శ్రీనివాస్‌, సతీశ్‌, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు.

ప్రజల రక్షణ కోసం

24 గంటలు పనిచేస్తాం

వరంగల్‌ క్రైం: సమాజ రక్షణ కోసం పోలీసులు 24 గంటల పనిచేయాల్సి ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్ముడ్‌ రిజర్వ్‌ పోలీసులకు 15 రోజులపాటు నిర్వహించిన పునఃశ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ క మిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై సా యుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీ స్‌ పరేడ్‌ను తిలకించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్‌, శ్రీని వాస్‌, ట్రెయినీ ఐపీఎస్‌ మనీషా నెహ్రా, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్‌ఐలు సతీశ్‌, చంద్రశేఖర్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

మేడారం బస్సుల కోసం భక్తుల ధర్నా

హన్మకొండ: మేడారం జాతర ప్రత్యేక బస్సుల కో సం భక్తులు హనుమకొండ బస్‌స్టేషన్‌ శనివారం రా త్రి ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడారం వెళ్లేందుకు హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ చేరుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది బాలసముద్రంలోని కుడా మైదానం నుంచి మే డారం బస్సులు వెళ్తాయని మైక్‌లో అనౌన్స్‌ చేశారు. దీంతో భక్తులు కుడా మైదానం చేరుకున్నారు. అక్కడికి చేరుకునే సరికి బస్సులు అందుబాటులో లేవు. అప్పటి వరకు వెలిగిన లైట్లు ఆర్పివేయడంతో ఆగ్రహానికి గురైన భక్తులు బాలసముద్రంలోని ప్రధాన రహదారిపైకి చేరుకుని రెండు గంటలపాటు ధర్నా, రాస్తారోకో చేశారు. సీఎం, ఆర్టీసీ అధికారులు డౌన్‌డౌన్‌ అంటూ ఆందోళన చేయడంతో వాహనాల రా కపోకలకు ఆటంకం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 9 గంటలకు చేరుకుని భక్తులను శాంతిపజేసి కుడా మైదానంలోకి పంపించారు. వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత చేరుకున్నారు. ప్రత్యేక బస్సులను తెప్పించి భక్తులను మేడారం పంపించారు.

థర్డ్‌లైన్‌ వర్క్స్‌..  
1
1/1

థర్డ్‌లైన్‌ వర్క్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement