దొంగను పట్టుకొచ్చారు..
హసన్‌పర్తి: చోరీ చేసిన సొత్తుతో స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్‌కు వెళ్లిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. కేయూ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన నిందితుడి వివరాలు వెల్ల డించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఫెరోజ్ షేక్, సుక్‌చంద్, యామీన్ ముఠాగా ఏర్పడి ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీలు చేసిన నగలను అమ్ముకుని జల్సాలు చేసేవారు. ఇటీవల ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా.. అదే ప్రాంతానికి చెందిన ఫిరోజ్ కూడా తమ ముఠా సభ్యుడిగా పేర్కొన్నారు. డిసెంబర్ 17న పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో జరిగిన చోరీల్లో ఫిరోజ్ కూడా ఉన్నాడని, చోరీకి సంబంధించిన ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు ఫిరోజ్ వద్ద ఉన్నట్లు ముఠా సభ్యులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు ఏసీపీ తెలిపారు. అయితే అనారోగ్య కారణంగా మళ్లీ ఫిరోజ్ తమతో రాలేదని ముఠా సభ్యులు చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేక బృందం..
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు ఫిరోజ్‌ను అరెస్టు చేయడానికి ఎస్సైలు నవీన్, రాజ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు మహేశ్, అంజయ్య, కానిస్టేబుళ్లు వంశీ, మధుకర్, చంద్రశేఖర్, రాములు, వెంకటన్న, రాజశేఖర్, జితేందర్, కల్యాణి బృందం పశ్చిమ బెంగాల్‌కు బయల్దేరినట్లు ఏసీపీ చెప్పారు. 9 రోజుల పాటు అక్కడ ఉండి నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
వరంగల్ క్రైం: చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన గుగులోతు నవీన్ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 17 చోరీలకు పాల్పడి, ఆ కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా హనుమకొండ, మట్టెవాడ, కుషాయిగూడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఈనెల 23న దొంగతనం చేసేందుకు హనుమకొండ బస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అతడి నుంచి వద్ద నుంచి ఇళ్ల తాళాలు పగులగొట్టడానికి ఉపయోగించే వస్తువులు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సింహారావు వివరించారు. కాగా, దొంగను పట్టుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది హరిప్రసాద్, కుమార్‌ను ఏసీపీ అభినందించారు. హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఎస్సైలు పరశురాం, సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
● పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడి నుంచి
బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
● వివరాలు వెల్లడించిన హనుమకొండ
ఏసీపీ నర్సింహారావు


