అట్టహాసంగా ‘స్పార్క్రిల్’ ప్రారంభం
హసన్‌పర్తి: అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న స్పార్క్రిల్–26 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణారావు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సాంస్కృతిక పోటీలు దోహదపడుతాయన్నారు. పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. డీన్ డాక్టర్ అర్చనారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇలాంటి పోటీలు దోహదపడుతాయని చెప్పారు. స్టూడెంట్స్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పోటీల్లో ప్రతీ విద్యార్థి పాల్గొనాలని సూచించారు. తొలి రోజు మార్షల్ ఆర్ట్స్, ఓపెన్ మైక్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో ప్రదర్శన ఇచ్చారు.
సృజనాత్మకతను వెలికి తీయడానికి
పోటీలు
ఎస్సార్ వర్సిటీ రిజిస్ట్రార్
వెంకటరమణారావు
అట్టహాసంగా ‘స్పార్క్రిల్’ ప్రారంభం


