ఉత్సాహంగా టీ 20 క్రికెట్ మహిళా జట్టు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంగాలపల్లిలోని మైదానంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా టీ–20 క్రికెట్ మహిళా జట్టు ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా డబ్ల్యూడీసీఏ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులతో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారిలో సి.హెచ్. సాయిసహస్ర, ఎన్. సాయిదృవిజ్ఞ, వి. చైతన్య, వి. స్నేహ, ఎన్. సాయిశ్రీజ, బి.నేహ శాన్విసాగర్, డి.సహస్రరాజ, ఎం. సౌమ్యశ్రీ, జి. వాసవి, డి. సాయిప్రసన్నరాజ్, టి. కృష్ణవేణి, పి. హర్షిత, బి. అక్షిత, ఆర్. సిరి, జి. మోహనశ్రీ, ఎం. నవ్య, జె. అనూష, ఎస్. జ్యోతిర్మయి, బి. నవ్య ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వరంగల్‌లో జరగాల్సిన అంతర్‌జిల్లాల స్థాయి టీ–20 క్రికెట్ మహిళా పోటీలను మేడారం జాతర నేపథ్యలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు త్వరలో వెల్లడిస్తారన్నారు. మార్నేని ఉదయభాను రావు, మట్టెడ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


