గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల (టెమ్రిస్) కౌన్సిలర్ సర్వర్ మొహియొద్దీన్ ఘాజీ కోరారు. వరంగల్ నగరంలోని పలు మసీదుల్లో మత పెద్దలను కలిసి గురుకులాల్లో అందిస్తున్న విద్య, సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో మత పెద్ద రఫీ, అరబిక్ టీచర్ అహ్మద్ పాల్గొన్నారు.
అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ..
రంగశాయిపేట శివారు వరంగల్(బీ1) మైనార్టీ గురుకులంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ అడ్మిషన్ల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ జి.భిక్షపతి మాట్లాడుతూ ఆసక్తిగల విద్యార్థులు గురుకులం, ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


