కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ నిర్వాహకురాలికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ నిర్వాహకురాలికి సన్మానం

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

కలెక్టరేట్‌లో క్యాంటీన్‌  నిర్వాహకురాలికి సన్మానం

కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ నిర్వాహకురాలికి సన్మానం

కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ నిర్వాహకురాలికి సన్మానం

న్యూశాయంపేట: వరంగల్‌ మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవి.. ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రథకం ద్వారా యూబీఐ నక్కలగుట్ట శాఖలో రూపాయి వడ్డీకి రుణం పొంది వరంగల్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో టీ స్టాల్‌ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్న ఆమెను భారతి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ ఎండీ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ఆర్గనైజర్‌ శ్రవణ్‌, సభ్యులు శైలజ, ఆడెపు రవివర్మ, డోలి ఎల్లయ్య, ఇనుముల రమేష్‌, కట్టమల్లు, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement