రాజన్నకు తొలిమొక్కులు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి ముందు వేములవాడ రాజన్నకు తొలి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న ఆచారం. వేములవాడ రాజన్న ఆలయం పునఃప్రతిష్ఠ అభివృద్ధి పనులు చేపట్టారు.. భీమన్న ఆలయంలో రాజన్న దర్శనాలను ఏర్పాటు చేశారు.. అయినప్పటకీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు.
శివసత్తుల హోరు
మేడారం జాతర వచ్చిందంటే అడుగడుగునా శివసత్తుల హోరు కనిపిస్తోంది. శివవసత్తులు జోలెపట్టుకొని బియ్యాన్ని సేకరించి, ఆ బియ్యాన్ని నైవేధ్యంగా వండి ఇంటిలోని శంకరుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇంటిలో ఐదుగురు పార్వతులను ఆహ్వానించి ఒడిబియ్యం, కుడుక, పోక, ఖర్జూర, రవికముక్కను అందజేస్తారు. అనంతరం ఇంట్లో పూజ చేసుకుని వేములవాడలో రాజన్నను దర్శించుకుని.. కోడె కట్టడం, కుంకుమ పూజ, ఆకు పూజ, అన్నపూజ చేసి శివపార్వతులకు మొక్కులు, కానుకలను సమర్పిస్తారు. అనంతరం వేములవాడలోనే ఉన్న బద్దిపోచమ్మకు ఒడిబియ్యం, కోళ్లు, మేకలు, బోనం, బెల్లం శాఖ, కల్లు ఆరబోసి మొక్కులు చెల్లిస్తారు.
వనదేవతలకు మొక్కులు
వేములవాడకు వెళ్లివచ్చిన భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మల వద్దకు చేరుకొని అటవీ ప్రాంతంలో బస చేసి అక్కడే తల్లులకు మొక్కులు చెల్లిస్తారు. తల్లులకు ఎంతో ఇష్టమైన ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లంగ చూడండి తల్లులారా.. అంటూ వేడుకుంటారు. ఆతర్వాత కోళ్లు, మేకలను తల్లులకు బలిచ్చి వంటలు చేసుకొని సహపంక్తిభోజనాలు చేస్తారు
ఒడిబియ్యం, చీర సారెతో
బద్దిపోచమ్మకు బోనం
తర్వాత సమ్మక్క–సారలమ్మకు బంగారం
మహాజాతరకు ముందు
అనాదిగా వస్తున్న ఆచారం
52 ఏళ్ల నుంచి పోతున్నా..
వేములవాడ రాజన్న గుడికి 52 ఏళ్ల నుంచి పోతున్నా. మేడారం జాతరకు కూడా పోయి వస్తున్నా. పిల్లాపాపలు కుటుంబాన్ని తల్లులు సల్లంగ ఉంచుతారు. మేడారం జాతర ముందు వేములవాడకు పోయిరావడం ఆనవాయితీగా వస్తుంది. శివసత్తులను ఇంటింటికీ పిలిచి ఒడిబియ్యం పోస్తారు.
–గాజుల కొమురమ్మ, శివసత్తి
రాజన్నకు తొలిమొక్కులు
రాజన్నకు తొలిమొక్కులు


