ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

ఛత్తీ

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం

విద్యార్దులను ప్రోత్సహించాలి

ఏటూరునాగారం: మేడారం మహాజాతరకు రావాలని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయిని సమ్మక్క–సారలమ్మ పూజారులు సిద్ధబోయిన సురేందర్‌, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు పొదెం రవీందర్‌, మైపతి సంతోష్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు. రాయ్‌పుర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాద్యక్షుడు భరతపురం నరేశ్‌, మండల ప్రధాన కార్యదర్శి బొల్లికొండ సాంబయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

రౌడీషీటర్‌ కోతి సురేశ్‌ నగర బహిష్కరణ

కమిషనరేట్‌ పరిధిలో

తొలి బహిష్కరణ ఇదే

వరంగల్‌ క్రైం: మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్‌ వంచనగిరి సురేష్‌ అలియాస్‌ కోతి సురేష్‌ను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ జారీ చేసిన ఉత్తర్వులను మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేష్‌ నిందితుడు సురేష్‌కు శుక్రవారం అందజేశారు. కోతి సురేష్‌ పై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం 1348, వరంగల్‌ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ చట్టం, 2015లోని సెక్షన్‌లోని 26(1) ప్రకారం ఆరు నెలల బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రౌడీషీటర్‌ సురేష్‌ పలుసార్లు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ శాంతియుత జనజీవన విధానానికి ఆటంకం కలిగించినట్లు పోలీస్‌ రికార్డులు నమోదయ్యాయి. ఇతని అక్రమ కార్యకలాపాలకు భయపడి ప్రజలు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడటంతో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నగర బహిష్కరణ విధించారు.

విద్యారణ్యపురి: ఇంటర్‌ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. శ్రీధర్‌ కోరారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ సవ్వాసి శ్రీనివాస్‌, అధ్యాపకులు రాజేంద్రప్రసాద్‌, నీరజాదేవి, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవి మాట్లాడారు.

దేశవిముక్తి కోసం

పోరాడిన నేతాజీ

కేయూ క్యాంపస్‌: దేశవిముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ అని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రావుల కృష్ణ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని బాటనీ విభాగం సెమినార్‌హాల్‌లో శుక్రవారం నేతాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్‌ ప్రముఖ్‌ అంబాల కిరణ్‌, కేయూ ఇన్‌చార్జ్‌ నిమ్మల రాజేశ్‌, సెక్రటరీ మేకల జ్ఞానేశ్వర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణీంద్ర, వరంగల్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఆగపాటి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం1
1/2

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం2
2/2

ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement