మేడారం భక్తులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

మేడారం భక్తులకు గాయాలు

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

మేడార

మేడారం భక్తులకు గాయాలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెలపై బెల్లం, కొబ్బరికాయలు విసిరేయడంతో భక్తులు గాయలపాలువుతున్నారు. తల్లులకు మొక్కులు తీర్చేందుకు భక్తులు గద్దెల వద్ద ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించడం అనవాయితీ. కానీ, భక్తులు నేరుగా గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు భద్రత సమస్యగా మారింది. శుక్రవారం గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడంతో 81 మంది భక్తులు గాయపడ్డారు. గాయపడినవారిని సింగరేణి రిస్క్యూ టీం గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం వద్ద చికిత్స అందించారు. ఎక్కువగా గాయపడిన భక్తులను టీటీడీ కల్యాణ మండపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గద్దెల వద్ద సొమ్మసిల్లిన యువతి ..

మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణంలో ఓ యువతి సొమ్మసిల్లి పడిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన వెన్నెల తల్లుల దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయిన వెన్నెలను గుర్తించిన రెస్క్యూ టీం సభ్యులు కార్వెంట్‌ (కృత్రిమ గాలి) అందించి కాపాడారు.

హోర్డింగ్‌ కూలడంతో భక్తుడికి..

ఏటూరునాగారం: జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం, ఇతర ప్రచారం చేసేలా మేడారంలో పలుచోట్ల స్వాగతం హోర్డింగ్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం హరితహోటల్‌ సమీపంలోని హోర్డింగ్‌ మరిపెడ బంగ్లాకు చెందిన ఎడ్ల నర్సయ్యపై పడింది. తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూలితే పెనుప్రమాదం జరిగేదని, ప్రధాన రోడ్ల వెంట ఉన్న హోర్డింగ్‌లను తొలగించాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత నిర్వాకులు హోర్డింగ్‌లను తొలగించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. హోర్డింగ్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ మీద పడ్డప్పుడు పక్కనే కానిస్టేబుల్‌ ఉన్నా.. ఎలాంటి సాయం చేయలేదని చుట్టు పక్కలవారి సాయంతోనే ప్రాణాలతో బయటపడ్డానని ఎడ్ల నర్సయ్య చెప్పడం గమనార్హం.

బెల్లం, కొబ్బరికాయలు గద్దెలపైకి

విసురుతున్న భక్తులు

మేడారం భక్తులకు గాయాలు 1
1/2

మేడారం భక్తులకు గాయాలు

మేడారం భక్తులకు గాయాలు 2
2/2

మేడారం భక్తులకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement