రైతులకు వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు వసతులు కల్పించాలి

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

రైతులకు వసతులు కల్పించాలి

రైతులకు వసతులు కల్పించాలి

వరంగల్‌: వరంగల్‌ రీజియన్‌లోని వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ఆర్‌జేడీఎం లక్ష్మణుడు ఆదేశించారు. శుక్రవారం వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మిర్చి సీజన్‌ ప్రారంభమైనందున మార్కెట్లకు వచ్చే రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈఏడాది మార్కెట్‌ ఫీజుల లక్ష్యాలను సాధించాలని, బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. వరంగల్‌ మార్కెట్‌లోని మిర్చి యార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కార్యదర్శి మల్లేశంకు సూచించారు. అనంతరం ఆయన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, పండ్ల సెక్షన్‌ అధ్యక్షుడు వెల్ది సాంబయ్యతో కలసి ముసలమ్మకుంటలోని మామిడి మార్కెట్‌ను సందర్శించారు. గత ఏడాది మామిడి మార్కెట్‌లోవసతులు కల్పించేందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా మంజూరు కాలేదని జేడీఎంకు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం కల్పిస్తే రైతులకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుందని రవీందర్‌రెడ్డి చెప్పగా ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాలని మార్కెట్‌ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, మార్కెటింగ్‌ ఇంజనీరింగ్‌ ఈఈ ఎల్లేశ్‌ , గ్రేడ్‌–2 కార్యదర్శి రాము, ఏఎస్‌ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌జేడీఎం లక్ష్మణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement