ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు

కమ్మర్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రారంభమైన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ము గిసింది. అండర్‌–17 బాలబాలికల విభాగంలో ని ర్వహించిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో నిజా మాబాద్‌ జిల్లా జట్టు విజేతగా నిలువగా, రన్నర్‌గా వరంగల్‌, తృతీయ స్థానంలో ఆదిలాబాద్‌ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విజేతగా నిజామాబాద్‌, రన్నర్‌గా మెదక్‌, తృతీయ స్థానంలో మహబూబ్‌నగర్‌ జట్లు నిలిచాయి. ఈ టోర్నమెంట్‌లో ఒ క్కో విభాగంలో 10 జిల్లా జట్ల చొప్పున 350మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. రాష్ట్ర జట్టు వివరాలను శనివా రం జిల్లా కేంద్రంలో వెల్లడిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూలో జరిగే 69 వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ సాఫ్ట్‌ బాల్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్రజట్టుగా పాల్గొంటారని వివరించారు. ఎస్జీఎఫ్‌ రాష్ట్ర పరిశీలకులు నాగరాజు , వీరేశం, జిల్లా సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్‌, సంయుక్త కార్యదర్శులు ఎం సుజాత, చిప్ప నవీన్‌, వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్వీ హనుమంత్‌రెడ్డి, ఎంఈఓ ఆంధ్రయ్య, ఎంపీడీఓ రాజశ్రీనివాస్‌, పీడీ నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ పి.నర్సయ్య, సర్పంచ్‌ హారిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement