వనదేవతలు ఆత్మగౌరవానికి ప్రతీకలు | - | Sakshi
Sakshi News home page

వనదేవతలు ఆత్మగౌరవానికి ప్రతీకలు

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

వనదేవతలు ఆత్మగౌరవానికి ప్రతీకలు

వనదేవతలు ఆత్మగౌరవానికి ప్రతీకలు

హన్మకొండ కల్చరల్‌: వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఆత్మగౌరవానికి ప్రతీకలని, జానపద గిరిజన పీఠంలో సమ్మక్క–సారలమ్మ జాతరపై పరిశోధనలు జరిగాయని, 2008లో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిందని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ డ్రమెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 29న హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో సమక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం వరంగల్‌ హంటర్‌రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో నాటక ప్రదర్శన వాల్‌పోస్టర్‌ను వెంకన్న ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అకుల సదానందం, పీఠం జూనియర్‌ అసిస్టెంట్‌ అమేర్‌అలీఖాన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రీమంతుల దామోదర్‌, డాక్టర్‌ బాసాని సురేశ్‌, డాక్టర్‌ చూరేపల్లి రవికుమార్‌, అబ్బు గోపాల్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ గంపా సతీశ్‌, సిబ్బంది విజయలక్ష్మి, అంజనేయులు, అశోక్‌, విద్యార్థులు శాంతి, శాలిని పాల్గొన్నారు.

జానపద గిరిజన విజ్ఞానపీఠం

పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న

సమ్మక్క–సారలమ్మ పద్యనాటక

ప్రదర్శన పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement