ఓటు హక్కును వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Jan 24 2026 7:05 AM | Updated on Jan 24 2026 7:05 AM

ఓటు హక్కును  వినియోగించుకోవాలి

ఓటు హక్కును వినియోగించుకోవాలి

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి

హన్మకొండ: ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా శుక్రవారం ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎండీ వరుణ్‌ రెడ్డి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంరతం వరుణ్‌ రెడ్డి మాట్లాడతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా తమ ఓటును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, చీఫ్‌ ఇంజనీర్లు టి.సదర్‌ లాల్‌, కె.రాజు చౌహన్‌, అశోక్‌, మాధవ రావు, కె.వెంకటరమణ, సురేందర్‌, శ్రవణ్‌ కుమార్‌, సీజీఎంలు చరణ్‌ దాస్‌, కిషన్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీకృష్ణ, జీఎంలు శ్రీనివాస్‌, వాసుదేవ్‌, నాగ ప్రసాద్‌, సామ్య నాయక్‌, జయరాజ్‌, వెంకట కృష్ణ, వేణు బాబు, కృష్ణ మోహన్‌, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement