రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

Jan 22 2026 8:35 AM | Updated on Jan 22 2026 8:35 AM

రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు

హసన్‌పర్తి: నగరంలోని 65, 66వ డివిజన్లలో సుమారు రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను బుధవారం మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ప్రారంభించారు. 65వ డివిజన్‌ దేవన్నపేటలో సుమారు రూ.60 లక్షలు, 66వ డివిజన్‌ హసన్‌పర్తిలో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రూ.8 లక్షలతో హసన్‌పర్తి పెద్ద చెరువు కట్టపై ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు బుధవారం పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్‌, దివ్యరాణి, కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కనపర్తి కిరణ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతి, దేవస్థాన కమిటీ చైర్మన్‌ ఆరెల్లి వెంకటస్వామి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్‌, దేవస్థాన మాజీ చైర్మన్‌ జె.రవి, పెద్దమ్మ నర్సింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ చకిలం రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు

మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సట్కూరి సంతోశ్‌, కేదారి రాకేశ్‌, కేదారి, వెంకటేశ్వరు, కిరణ్‌, చీరాల రవి తదితరులు పాల్గొన్నారు.

పెద్ద చెరువుకట్టపై ఓపెన్‌ జిమ్‌

ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement