కొత్తూరు హైస్కూల్ తరలింపునకు యత్నం
● అడ్డుకున్న సమ్మయ్యనగర్ కాలనీవాసులు
విద్యారణ్యపురి: హనుమకొండలోని గోపాల్‌పురం ప్రాంతంలో అద్దెభవనంలో ఉన్న కొత్తూరు ప్రభు త్వ హైస్కూల్‌ను సమీపంలోని సమ్మయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించాల ని డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కొత్తూరు ప్రభుత్వ హై స్కూల్ హెచ్‌ఎం లచ్చిరాం నాయక్, ఉపాధ్యాయులు కలిసి ఆ పాఠశాలలోని విద్యార్థులను శుక్రవా రం తీసుకొని సమ్మయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. దీంతో ఆ కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సమ్మయ్యనగర్‌లోని ఈ భూమిని ప్రాథమిక పాఠశాల కోసం ఇచ్చామని, ఇప్పుడు ఇక్కడ హైస్కూల్ ఏర్పాటుచేయడం సరికాదని అన్నారు. హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ మహేష్ అక్కడి వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను తీసుకొని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు వెనుదిరిగారు.


