వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేసి, తల్లుల గద్దెల వద్ద పూజలు చేసి మొక్కులు సమర్పించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేశ్ గీతే బాబాసాహెబ్‌లతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో మల్టీజోన్ ఐజీని గద్దెలపై స్వాగతం పలికారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీలు, ఎస్పీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్ అమ్మవార్ల కండువాలతో సన్మానించి బెల్లం, ప్రసాదం అందజేశారు.
వనదేవతలకు భక్తుల మొక్కులు


