భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారాన్ని సందర్శించిన ఆయన మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో జాతరలో ట్రాఫిక్, భక్తుల భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం సాఫీగా జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్లలో, సెక్టార్‌లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు అవసరమైనంతమంది సిబ్బందిని జాతర విధులకు నియమించుకోవాలని చెప్పారు. జాతరలో భక్తుల భద్రత ఏర్పాటు విషయంపై బందోబస్తుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాన్నారు. సమావేశంలో రామగుండం, వరంగల్, కరీంనగర్ సీపీలు అంబర్ కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్, గౌస్ ఆలం, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేష్ గీతే బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, నార్లాపూర్, తాడ్వాయి ఎస్సైలు కమలాకర్, జగదీశ్ పాల్గొన్నారు.
మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
సమష్టిగా జాతరను జయప్రదం చేయాలి
మేడారంలో బందోబస్తుపై సమీక్ష


