తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

Jan 3 2026 8:11 AM | Updated on Jan 3 2026 8:11 AM

తప్పు

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

డీజీపీని కోరిన

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

వరంగల్‌: 2023 డిసెంబర్‌ నుంచి వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌ పోలీసు స్టేషన్లలో కొందరు ప్రముఖలు, సామాన్యులపై అక్రమంగా కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సారయ్య మాట్లాడుతూ వరంగల్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని 3 పోలీస్‌ స్టేషన్లలో అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ ఇతర కేసులపై పునఃవిచారణ చేయాలని కోరారు. పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పనిచేసే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో ఖిలావరంగల్‌ పరిధిలో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితులను కనిపెట్టినా అరెస్టు చేయలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందుకు బాధితులు, వరంగల్‌ నగర ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు డీజీపీకి ఆయన తెలిపారు. ఈచర్యల వల్ల ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగిందని తెలిపారు.

గుట్కా పట్టివేత

వరంగల్‌ క్రైం : నగరంలోని టైలర్‌ స్ట్రీట్‌లో గల బాలాజీ కిరాణా షాపు గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపారు. సుమారు రూ.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వాహకుడు పవన్‌ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై సతీష్‌, క్రైం పార్టీ రావుఫ్‌, అశోక్‌ పాల్గొన్నారు.

లారీ ఢీకొని యువకుడి మృతి

కమలాపూర్‌ : మండల కేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరి రాజు (30) హుజూరాబాద్‌ వైపు నుంచి కమలాపూర్‌ వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కమలాపూర్‌ బస్టాండ్‌ వద్ద అదే వైపు వస్తున్న గ్యాస్‌ సిలిండర్ల లారీ రాజు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు లారీ కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో రాజును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందాడని ధ్రువీకరించారు.

తప్పుడు కేసులు పెట్టిన  పోలీసులపై చర్యలు తీసుకోవాలి1
1/2

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

తప్పుడు కేసులు పెట్టిన  పోలీసులపై చర్యలు తీసుకోవాలి2
2/2

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement